‘లీగల్లీ వీర్’ మూవీ రివ్యూ..ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?
కరోనా తర్వాత సినిమా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీలు అందుబాటులోకి రావడంతో సినీ అభిమానులు థియేటర్ల రావడం తగ్గించేశారనే చెప్పాలి.ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కొన్ని సినిమాలు సత్తా చాటుతున్నాయి.ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా చూసే సినిమాలు చిన్నపాటి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ తరహా చిత్రమే "లీగల్లీ వీర్". వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
బాలరాజు అనే సామాన్యుడు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య అతడు చేయకపోయినా.. అతనే చేసినట్లు అన్నీ కోణాల నుండి నిరూపించడానికి డిఫెన్స్ కి ఛాన్స్ ఉంటుంది. అలాంటి తరుణంలో బాలరాజు తరపున వాదించడానికి కేస్ టేకప్ చేస్తాడు వీర్ (మలికిరెడ్డి వీర్ రెడ్డి). ఊహించినదానికంటే ఎక్కువ కోణాలు ఈ కేసులో ఉన్నాయని, చాలా మంది ఈ కేసు వెనుక ఉన్నారని తెలుసుకుంటాడు వీర్. ఒక లాయర్ గా వీర్ చేసిన సాహసాలేమిటి? బాలరాజును కేసు నుండి బయటపడేయగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానం "లీగల్లీ వీర్" చిత్రం.

విశ్లేషణ:
దర్శకుడు ఎంచుకున్న కోర్డు డ్రామా పాయింట్ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడమే సినిమాకు కొంత ఇబ్బందిగా మారింది. సాఫీగా సాగుతున్న కథకి యాక్షన్ బ్లాక్, రొమాంటిక్ సాంగ్స్ అడ్డంకిగా మారాయి. అయినప్పటికీ అసలు కథను దారి తప్పకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. అక్కడక్కడ వకీల్ సాబ్ తరహా సీన్స్ కనిపించాయి. టెక్నికల్ టీమ్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌ఫుట్ తీసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
నటీనటుల పనితీరు
లాయర్ వీర్ పాత్రకి మలికిరెడ్డి వీర్ రెడ్డి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అనుభవ లేమి కారణంగా హావభావాలు పలికించడంలో కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించింది.బాలరాజు పాత్ర పోషించిన యువకుడు చాలా సహజంగా నటించాడు. బాలరాజు భార్య పోషించిన యువతి కూడా చక్కగా పాత్రలో ఇమిడిపోయింది.
సాంకేతికవర్గం
టెక్నికల్ గా ఆశ్చర్యపరిచిన సినిమా ఇది. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ఈమధ్యకాలంలో వచ్చిన చాలా చిన్న సినిమాలకంటే బెటర్‌గా ఉంది. దర్శకుడు రవి గోగుల ఎంచుకున్న కథలో నిజాయితీ ఉంది. అయితే.. కొన్ని కమర్షియల్ ఇరుకుబాట్లకు తలొగ్గక తప్పలేదని అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న జాగ్రత్తలకు, కథను మరీ ఎక్కువగా డీవియేట్ కాకుండా నడిపించినందుకు దర్శకుడు రవి గోగుల పనితనం కనిపిస్తోంది.
ముగింపు
కోర్టు డ్రామా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగత యాత్ర, బలమైన న్యాయ పోరాటం, మరియు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications