కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!

ఈ రోజుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం.. ఇలాంటి మాటలు చాలానే వినిపిస్తుంటాయి. కానీ టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాదు.. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం కూడా ఈజీనే అని నిరూపించాడు కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. చేసింది నాలుగు సినిమాలే.. అయినా యూత్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాకు కలెక్షన్స్ వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.

చేసింది కేవలం నాలుగు సినిమాలే అందులో మూడు బ్లాక్ బస్టర్లు.. అవి కూడా యాట్రిక్.. పెద్ద పెద్ద హీరోలకూ సాధ్యం కాని ఫీట్ ను సాధించాడు ప్రదీప్ రంగనాథన్.. వరుసగా మూడు రూ.100 కోట్ల సినిమాలు అందించి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో ఈ ఘనత సాధించాడు. అయితే ప్రదీప్ రంగనాథన్ నుంచి నాలుగో సినిమా LIK మాత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయితే ఈ మూవీకి ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గానే ప్రదర్శన చేస్తున్నట్లు సమాచారం.

తొలిరోజు మాత్రమే కాదు.. రెండో రోజు కూడా ఈ చిత్రానికి స్ట్రాంగ్ గా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అన్ని భాషల్లో కలిపి LIK మూవీకి రూ. 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా.. రెండో రోజున రూ. 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూల్లు రావడం విశేషం. అయితే వీకెండ్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ సోమవారం నుంచి క్రమంగా కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

LIK Movie Crosses Huge Numbers in Tamil Nadu in Just 2 Days Telugu Market Draws Blank LIK movie

ఇక LIK మూవీ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోవడానికి ముఖ్య కారణం ఈ మూవీ వరసగా వాయిదాలు పడటమే.. దాదాపు రెండేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రేక్షకుల్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అయినా కూడా LIK మూవీకి భారీ ఓపెనింగ్ వచ్చిందంటే.. అది ప్రదీప్ రంగనాథన్ బ్రాండ్ ఇమేజ్ కారణం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ ఆశించినంతగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. కానీ తమిళనాడులో మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటుందో.. లేక ప్లాఫ్ టాక్ తోనే ముగిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+