ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్..
ఈ వారంలో కూడా సినిమా లవర్స్ కోసం పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత వారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ గానే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఓటీటీలో సైతం సందడి చేసేందుకు పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా...
డ్రాగన్..
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న చిత్రం డ్రాగన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రాబోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

రామం రాఘవం..
తండ్రి కొడుకుల ఎమోషన్స్ తో రాబోతున్న మూవీ 'రామం రాఘవం'. ఈ సినిమాలో సముద్రఖని - ధనరాజ్ తండ్రీ కొడుకులుగా నటించారు. హాస్యనటుడు ధనరాజ్ కీలక పాత్ర పోషిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి.. నాన్న తనని అర్థం చేసుకోవడం లేదని బాధపడే ఓ తనయుడి సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.
బాపు..
బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం 'బాపు'.అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ సహా పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరులో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి.. డబ్బు అవసరాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు.. అనే అంశాలు ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.
జాబిలమ్మ నీకు అంత కోపమా..
తమిళ స్టార్ హీరో ధనుష్.. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగానూ జోష్ మీద దూసుకుపోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కొత్త చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ సినిమాలో హీరోగా పవీష్ నటించగా.. అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్..
జీరో డే - వెబ్‌సిరీస్ - ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ - తెలుగు - ఫిబ్రవరి 21
అమెజాన్ ప్రైమ్..
రీచర్ 3 - వెబ్‌సిరీస్ - ఫిబ్రవరి 20
డిస్నీ + హాట్‌స్టార్..
ది వైట్ లోటస్ - వెబ్‌సిరీస్ - ఫిబ్రవరి 17
ఊప్స్ అబ్ క్యా - హిందీ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20
ఆఫీస్ - తమిళ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 21
జీ5..
క్రైమ్ బీట్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 21












Click it and Unblock the Notifications