30 కోట్లు ఖర్చు 300 కోట్లు వసూలు చేసిన సినిమా.. స్టార్ హీరోలను సైతం వణికించింది
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసి ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఏకంగా 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది.
రికార్డు వసూళ్లు, బ్లాక్ బస్టర్ హిట్
కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రల్లో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం (తెలుగులో 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదలైంది) ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

ఓటీటీలోకి ఏడు వారాల తర్వాత..
సాధారణంగా పెద్ద సినిమాలు కూడా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తున్న ఈ రోజుల్లో, ఈ బ్లాక్ బస్టర్ చిత్రం మాత్రం ఏడు వారాల పాటు థియేటర్లలో తన ప్రభావాన్ని చూపించింది. గతంలో, నాలుగు వారాల్లోనే డిజిటల్ రిలీజ్ అవుతుందనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు.అయితే, ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడంటే?
నిర్మాతలు "త్వరలో" అని మాత్రమే ప్రకటించినప్పటికీ, సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీ నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. థియేటర్లలో చూడలేని సినీ ప్రేమికులు ఇప్పుడు ఇంట్లోనే తమ అభిమాన సూపర్ హీరో చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications