నువ్వు ఏది అడిగితే అది ఇస్తా..తోటి కంటెస్టెంట్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ

సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్‌బాస్ షో . కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. ఇక ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ ఆరంభం అయింది. బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా తన మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.ఈ సీజన్‌లో బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క నిలిచారు.

ఇక గతంలో బిగ్‌బాస్ హౌస్‌లో చాలా ప్రేమ కథలు పుట్టాయి. తాజా బిగ్‌బాస్ సీజన్‌లో కూడా ఓ లవ్ స్టోరీ మొదలైనట్టు కనిపిస్తోంది.వచ్చి రెండో వారాలు కూడా పూర్తి కాకుండానే నిఖిల్‌తో సోనియా ఆకుల క్లోజ్‌‌గా ఉంటుంది. సోనియా ఎక్కడ ఉంటే నిఖిల్ అక్కడ అనేలా కనిపిస్తుంది. ఇక ఈమధ్య వారి మధ్య మాటలు కూడా అనుమానాలకు దారి తీస్తున్నాయి. నిఖిల్‌కి సోనియా సిగరెట్ ఆపేయొచ్చు కదరా నువ్వు సిగరెట్ ఆపేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాననడం సంచలనంగా మారింది. . మరి ఆమె ఏం ఇవ్వాలని అనుకుందో తెలియదు కానీ కుర్రాడిని సిగరెట్ మానిపించడం కోసం సోనియా ఇచ్చిన ఆఫర్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది.

love story that started between Nikhil and Sonia in Bigg Boss

అయితే సోనియా నిజంంగానే నిఖిల్‌కు దగ్గరైందా లేదా తన గేమ్‌లో భాగంగా అలా ప్రవర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్‌తో క్లోజ్‌గా అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా సోనియా గేమ్ ప్లాన్ ఏంటన్నది తెలియడం లేదు. ఆమె వల్ల నిఖిల్ బ్యాడ్ అవుతున్నాడు. నిఖిల్ ఇలానే సోనియాను వెనకేసుకుని వస్తే తప్పకుండా అతని ఆట మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐతే ఇప్పటివరకు సోనియా ఆటల్లో తన స్టామినా చూపించలేదు. ఇప్పటివరకు ఒక్క టాస్క్ కూడా ఆమె గెలిచింది లేదు. మరి మిగతా హౌస్ మెట్స్‌కు పాయింట్ అవుట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా నిఖిల్ ఆట మీద దృష్టి పెడుతాడా లేదా అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+