అనసూయపై షాకింగ్ కామెంట్స్.. ఆమెను మోయలేనంటూ పరువు తీసేశాడుగా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ బరువుకు సంబంధించి గేయ రచయిత అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్ చేశారు. జీ కుటుంబం 2023 అవార్డు ఈవెంట్‌కు వచ్చిన వీరిద్దరూ..భగవంత్ కేసరిలోని ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్‌కి డాన్స్ చేశారు.అయితే ఆ సాంగ్ లో బాలకృష్ణ ఓ పాపని ఎత్తుకుని ఆడిస్తుంటారు.
దీని గురించే ప్రస్తావిస్తూ అనంత శ్రీరామ్.. నాకు కూడా నిన్ను చేతులతో ఎత్తుకొని డాన్స్ చేయాలని ఉంది . కానీ అది నా వల్ల కాదు నాకు చాలా కష్టం ఏమనుకోకే అంటూ అనసూయకు కౌంటర్ వేస్తాడు. దీంతో ఈవెంట్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అనసూయ కూడా అనంత శ్రీరామ్ తనపై చేసిన కామెంట్స్‌ను ఫన్నీగానే తీసుకున్నట్టు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications