Bigg Boss 9 Telugu: తొలి రోజే దివ్వెల మాధురి రచ్చ రచ్చ.. ప్రోమో రిలీజ్
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రోజురోజుకూ ఉత్కంఠగా సాగుతోంది. ఈ వారం ఫ్లోరా సైనీ, శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. దీంతో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష సహా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి ప్రవేశించారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్లంతా హౌస్ లోని ఇతరులతో కలిసిపోతున్నారు. ఇక హౌజ్ లోకి వచ్చిన ఒక్క రోజులోనే దివ్వెల మాధురి రచ్చ రచ్చ చేసింది. చివరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మేరకు తాజాగా ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగుపెట్టగానే శ్రీజ తో మాటల యుద్ధం పెట్టుకుంది. ఈమె పేరు ఆమెకు తెలియకపోవడం, మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగినందుకు.. నాతో గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నావా అంటూ సీరియస్ గా మాట్లాడింది దివ్వెల మాధురి. ఇక ఇవాళ బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అందులో కూడా ఈమె కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో గొడవ పడినట్లు ఉంది. కెప్టెన్ కల్యాణ్, సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్ అంతా కలిసి సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఈ సమయంలో అక్కడకు వచ్చిన దివ్వెల మాధురిని పవన్ కల్యాణ్ పిలిచి.. కూర్చోండి మాట్లాడాలి అని అన్నాడు. అప్పుడు మాధురి కూర్చోకపోతే ఊరుకోరా అని చాలా వెటకారంగా సమాధానం చెప్పింది. మీరు ఇలా మాట్లాడితే నేను మరోలా మాట్లాడాల్సి వస్తుందని కల్యాణ్ బదులిచ్చాడు. దాంతో మాట్లాడండి అంటూ దివ్వెల మాధురి పొగరుగా సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే దివ్య జోక్యం చేసుకుంది. 'మీరు ఇక్కడ లేరు... అందుకే చెబుతున్నా.. మీతో గొడవపడాలని కాదు' అని సర్దిచెప్పింది. అయినా కూడా మాధురి ఏమాత్రం తగ్గకుండా దివ్యతో పాటు కల్యాణ్ తోనూ వాగ్వాదానికి దిగింది. అనంతరం దివ్వెల మాధురి పక్కకు వెళ్లి కంటతడి పెట్టుకుంది. ఇది చూసిన కల్యాణ్.. మాటలన్నీ అని ఇప్పుడు ఏడిస్తే ఎలా అంటూ భరణి దగ్గర వాపోయాడు. ఆమె సొంత ఇల్లు అనుకుంటుందో, లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో అర్థం కావడం లేదని దివ్వెల మాధురిపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రవర్తన మార్చుకోకుంటే, వచ్చే వారం ఈమెను ఆడియన్స్ బయటకు గెంటేస్తారని మండిపడుతున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications