ఆ క్రికెటర్‌తో బ్రేకప్ కొంప ముంచింది - స్టార్ హీరోయిన్
రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. అయితే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు. కపిల్ దేవ్, కమల్ హాసన్ మాజీ భార్య సారికల మధ్య కొన్నాళ్లు లవ్ నడించింది.
ఇక హీరోయిన్ నగ్మ, సౌరవ్ గంగోలి గురించి అయితే ఏకంగా మీడియాలోనే అనేక కథనాలు వెలువడ్డాయి. యువరాజ్ సింగ్ , బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె , ధోని, హీరోయిన్ రాయ్ లక్ష్మి వంటి వారి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. నేటితరం హీరోయిన్లు సైతం క్రికెటర్స్‌తో ఎఫైర్లు కొనసాగిస్తున్నారు. అయితే బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ సైతం ఓ క్రికెటర్‌తో ప్రేమాయణం సాగించింది. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా-మాధురి దీక్షిత్‌ల మధ్య కొన్నాళ్లు ప్రేమ నడిచింది.

అప్పట్లో వీరిద్దరు బహిరంగంగానే తిరుగుతూ కనిపించారు.ఈ జంట తాము ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు కూడా. కొన్నాళ్లు వీరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకుందమనే సమయంలోనే జడేజా ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోయాడు. దీంతో మాధురి దీక్షిత్ అజయ్ జడేజాకు బ్రేకప్ చెప్పింది. దీనికి తోడు మాధురి దీక్షిత్ కుటుంబం నుంచి కూడా ఒత్తిడి రావడంతో అజయ్ జడేజా నుంచి విడిపోక తప్పలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
అజయ్ జడేజాకు బ్రేకప్ చెప్పిన వెంటనే పెళ్లి చేసుకున్నానని లేదంటే హీరోయిన్‌గా నా కెరీర్ ఇంకా కొన్ని సంవత్సరాలు సాగేదని మాధురి దీక్షిత్ చెప్పుకొచ్చింది. అజయ్ జడేజాతో బ్రేకప్ తరువాత మాధురి దీక్షిత్ డాక్టర్ శ్రీరామ్‌ను పెళ్లి చేసుకుంది. అబోధ్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. 90వ దశకంలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తరువాత నటనకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ 2007లో డ్యాన్స్ డ్రామా ఆజా నాచ్ లే తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది మాధురీ దీక్షిత్. ప్రస్తుతం మాధురి దీక్షిత్ కొన్ని షోలకు గెస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
-
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ -
నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్? -
రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !! -
ధురంధర్-2 పై RGV రివ్యూ.. షోలే కంటే 100 రెట్లు గొప్పగా.. స్పీల్ బర్గ్, నోలన్ సైతం.. -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications