మహేష్ బాబు - రాజమౌళి #SSMB29 టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే ??

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మహేష్‌ సరికొత్త లుక్‌లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్‌లో వర్కౌట్‌ చేసి మరింత ఫిట్‌ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తోంది.

ఈ పాన్-ఇండియా అడ్వెంచర్ డ్రామాలో.. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండడం సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఈ మూవీ ఇవ్వడం ఖాయమని మూవీ టీం చెబుతోంది. అలానే మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

mahesh-babu-and-rajamouli-movie-title-fix-as-varanasi

ఈ మేరకు ఈ మూవీకి ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా.. గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కానీ సోషల్ మీడియా, టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమాకి 'వారణాసి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. జక్కన్న ఎన్టీఆర్ - చరణ్ తో కలిసి తీసిన "ఆర్ఆర్ఆర్" లానే ఈ చిత్రానికి కూడా క్యాచీగా టైటిల్ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఈ సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అని చర్చించుకుంటున్నారు.

రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజూ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ లో మూవీ టైటిల్, పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దాంతో మూవీ టైటిల్ విషయంలో సస్పెన్స్ కి తెర పడాలంటే నవంబర్ 16 వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు. మహేష్ బాబు లుక్ అండ్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం జక్కన్న పెద్ద ప్లానే వేశారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇందుకోసం ఓ గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారని.. అవతార్ 3 సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా మహేష్ సినిమాను ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఆ గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో రామోజీఫిలిమ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు "వారణాసి" అనే పేరు ఫిక్స్ చేశారని కొందరు చెబుతుంటే.. మరికొందరు అది కేవలం ఫేక్ ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు. మరి రాజమౌళి - మహేష్ కాంబినేషన్ సినిమాకు సింపుల్ టైటిల్ సరిపోతుందా? లేక పాన్-వరల్డ్ మార్కెట్‌కి తగ్గట్లు గ్లోబల్ టైటిల్ వస్తుందా? అనే ఉత్కంఠ వారి అభిమానుల్లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+