‘వారణాసి’ తర్వాత మహేష్‌బాబు సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరో కాదు..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన టెక్నాలజీతో ఈసారి సినిమాను రాజమౌళి ఎలా తీయబోతున్నాడు? కథ ఏంటి? మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారతాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ 2027లో సమాధానం దొరకబోతోంది. ఈ సినిమాతో మహేష్ బాబు ఇమేజ్ ఎక్కడికో చేరిపోతోంది..అప్పుడు మరి ఎవరితో సినిమా చేయాలి? అనే డైలమాలో ప్రిన్స్ ఉన్నాడు. అందుకు తగినట్లుగానే దర్శకుడిని కూడా ఎంచుకున్నాడు. అతనెవరో కాదు.. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగా.
స్పిరిట్ అయిపోగానే..
వాస్తవానికి యానిమల్ సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సి ఉంది. అయితే అటువంటి పాత్రలో అభిమానులు తనను రిసీవ్ చేసుకోరని చెబుతూ చాలా సున్నితంగా తిరస్కరించాడు. అయితే ఇద్దరం కలిసి సినిమా చేద్దామని సందీప్ తో చెప్పడంతో తను కథను తయారుచేశాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో చేస్తారా? లేదంటే యానిమల్ 2 చేస్తారా? అనేది స్పష్టత రాలేదు. అయితే 2027కు మహేష్ బాబు సిద్ధంగా ఉంటాడుకాబట్టి సందీప్ తో చేయాలని నిర్ణయించుకున్నారు.

సునీల్ నారంగ్ నిర్మాత
ఏషియన్ సినిమాస్ బ్యానరుపై సునీల్ నారంగ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో, దర్శకుడు, నిర్మాత మధ్య చర్చలు ముగిశాయని ప్రచారం నడుస్తంది. వారణాసి షూటింగ్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొనబోతున్నాడు. గతంలో మహేష్ బాబు ఈ తరహా మాస్ పాత్రను చేయలేదని, చాలా ఇంటెన్స్ పాత్ర అని సమాచారం. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను ఎలా చూపస్తారో ఇప్పటికే ప్రపంచమంతా చూసింది.
ఆ తరహా పాత్రల్లో మహేష్ బాబు ఎలా ఉంటాడా? అనే ఉత్కంఠ సినీప్రియుల్లో నెలకొంది. రాజమౌళి సినిమా పూర్తవగానే సందీప్ సినిమా చేయబోతున్న మహేష్ బాబుకు నిర్మాత సునీల్ నారంగ్ తో వ్యాపార అనుబంధం ఉంది. ఏఎంబీ మాల్స్ వీరిద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఆ అనుబంధమే ఈ సంచలన ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి కారణమైంది.
-
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications