రాజమౌళి కంటే ముందుగా ఆ దర్శకుడితో మహేష్ బాబు సినిమా

ఒంటిచేత్తో సినిమాను సూపర్ హిట్ చేయగలిగే తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయనకు ఉండే క్రేజ్ మిగతా హీరోలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుల్లో రాజమౌళి స్థాయి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చారు. తన తర్వాత సినిమాను ఆయన మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా ప్రిన్స్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు. తాజాగా వీరిద్దరి సినిమాకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది.

28 సినిమాలు పూర్తిచేసిన మహేష్ బాబు తన 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారనే విషయం పాతది. 29వ సినిమా రాజమౌళికి బదులుగా అనిల్ రావిపూడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ నగర్ లో ఈ వార్త వైరల్ గా మారింది. కొంతమంది మాత్రం అది నిజమే అంటున్నారు. రాజమౌళి తన సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎంతో శ్రద్ధ పెడతాడని, అది తనకు నచ్చిన తర్వాత షూటింగ్ కు వెళతారని చెబుతున్నారు. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు అత్యధిక రోజులు షెడ్యూల్ ను కేటాయించాల్సి ఉంటుంది.

mahesh babu

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం చేస్తున్నాడు. ఇది త్వరలోనే షూటింగ్ పూర్తిచేసుకోబోతోంది. అలాగే అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చేశాడు. రాజమౌళి సినిమాకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమాను ప్రారంభించాలనే యోచనలో మహేష్ బాబు ఉన్నట్లు సమాచారం. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీంతో ప్రిన్స్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే మూవీ మహేష్ బాబు 30వ సినిమా అవుతుందంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వస్తేకానీ కొంత స్పష్టత వచ్చేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+