ఆ స్టార్ డైరెక్టర్ తో మహేశ్ బాబు 30వ సినిమా.. ఇండస్ట్రీ ఊచకోతే..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ఫీమేల్​ లీడ్​ గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాతి షెడ్యూల్​​ కెన్యా చేయాల్సి ఉంది. అయితే తాజాగా SSMB 30 సినిమాపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయంశంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబు 30వ సినిమాను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మహేశ్ బాబు కాంపౌండ్ నుంచి అయితే తరువాతి సినిమా సందీప్ రెడ్డితోనే చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు సందీప్ రెడ్డి వంగా కూడా గతంలో మహేశ్ బాబుతో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. దీంతో మహేశ్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కన్ఫామ్ అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇక SSMB 29 అమెజాన్‌ ఫారెస్ట్​ నేపథ్యంలో అడ్వెంచర్​ సినిమాగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారు.ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పై కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Mahesh Babu s Milestone 30th Film Sandeep Reddy Vanga to Direct Epic Gangster Saga

ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ లో యానిమల్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+