టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేనకోడలు..!
తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తనదైన శైలిలో సూపర్ స్టార్ గా ఎదిగారు. 300 కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు. డేరింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. కాగా కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా మహేశ్ బాబు ఎదిగారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు వెండితెరపై అడుగు పెట్టబోతోంది.
సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు.. మహేష్ బాబు మేన కోడలు.. మంజుల ఘట్టమనేని - సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు ఆ పోస్టులో.. నాకు హీరోయిన్ గా నటించవద్దని చెప్పిన వారే ఇప్పుడు నా కుమార్తె సినీ రంగంలోకి రావాలని కోరుతున్నారు. నా ప్రార్థనలకు జాన్వి చిరునవ్వే సమాధానం అని మంజుల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే విడుదలైన జాన్వీ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌తో ఉన్న ఆమె లుక్ ఫ్రెష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చిన్నపాత్రతో మొదలైన ప్రయాణం..
జాన్వీకి నటన కొత్తేమీ కాదు. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. అప్పుడు పదేళ్ల వయసులోనే కెమెరా ముందు సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆమె నృత్యం, నటనలో శిక్షణ తీసుకుంటూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాత కృష్ణ, మామయ్య మహేష్ బాబు బాటలో నడుస్తూ సినీ రంగంలో తన ముద్ర వేయాలని కోరుతూ విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా జాన్వీ నటనతో పాటు పెయింటింగ్, డాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ వంటి అనేక రంగాల్లో శిక్షణ పొందింది. అలానే ఒక జ్యువెలరీ క్యాంపెయిన్‌లో కనిపించిన తర్వాతే పలు జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించారని సమాచారం. కాగా మహేశ్ బాబు అక్కగానే కాకుండా, మంజుల ఘట్టమనేని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా - మూడు రంగాల్లోనూ ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.
ఇక మంజుల నటించి, నిర్మించిన "షో" సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆమె స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోకిరి, ఏ మాయ చేశావే వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు రూపొందాయి.
-
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం











Click it and Unblock the Notifications