Guntur Kaaram: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం (Guntur Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూరచిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ నటిస్తోన్నారాయన.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ ప్రొమో నేడు విడుదల కానుంది. ఈ ఉదయం సరిగ్గా 11:07 నిమిషాలకు దీన్ని రిలీజ్ చేయనుంది నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ శనివారమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్నారు.
షూటింగ్ శరవేగంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరు కారం నుంచి ఓ బిగ్ లీక్ బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సింగిల్‌కు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. వాట్సప్, ఎక్స్, ఫేస్‌బుక్, యుట్యూబ్‌లల్లో ఈ లిరికల్ సింగిల్ హల్‌చల్ చేస్తోంది. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తోంది చొక్కాపై గుండి.. అనే లైన్ వినిపిస్తుంది ఈ ఆడియో లీక్‌లో.












Click it and Unblock the Notifications