ప్లీజ్ బ్రదర్.. నువ్వు ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్లొద్దు .. రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు

'లిటిల్ హార్ట్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది. కేవలం రూ. 2.4 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం.. 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ చిత్రం ప్రేక్షకుల మనసుతో పాటు సినీ ప్రముఖుల మనసును కూడా గెలుచుకుంది . చిరంజీవి, అల్లు అర్జున్, రవితేజ, అక్కినేని నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, సుమంత్, అడివి శేష్.. ఇలా చాలామంది హీరోలు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాపై తన రివ్యూ పోస్ట్ చేశారు.లిటిల్ హార్ట్స్' మూవీకి యంగ్ మ్యూజిక్ కంపోజర్ సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించాడనే సంగతి తెలిసిందే.

సినిమా విజయంలో అతని పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. అయితే మనోడు మహేష్ బాబుకి డే హార్డ్ ఫ్యాన్. టాలీవుడ్ హీరోలందరూ తన సంగీతాన్ని మెచ్చుకుంటుంటే ఖుషీ అవుతున్న సింజిత్.. తన డెమి గాడ్ మహేష్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్వీట్ చేయాలని కోరుకున్నాడు. తనకు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలే అని, తనకు లైఫ్ లో ఇంకేమీ వద్దని, మహేష్ బాబు పోస్ట్ పెడితే అంతకుమించిన ఆనందం లేదని, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని ఒక వారం రోజులు ఎటైనా వెళ్లిపోతానని సింజిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. ఇది మహేష్ వరకూ చేరడంతో ఆయన తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు.తాజాగా 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసిన మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు.

Mahesh Babu s Heartfelt Review for Little Hearts Goes Viral Fulfills Music Director Sinjith s Dream

అంతేకాదు సింజిత్ గురించి స్పెషల్ గా మాట్లాడారు. "లిటిల్ హార్ట్స్ సినిమా సరదాగా, కొత్తగా, చాలా బాగుంది. నటీనటులందరూ ఎక్స్ట్రార్డినరీగా నటించారు. ముఖ్యంగా యంగ్ స్టర్స్ చాలా బాగా చేశారు. సెన్సేషనల్ యాక్టింగ్ అని చెప్పారు. ఎంతో జాయ్ ఫుల్ గా ఉంది!!! సింజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్. నువ్వు కొంతకాలం చాలా బిజీగా మారిపోతావు. రాకింగ్ చేస్తూ ఉండండి. మొత్తం టీంకి నా అభినందనలు" అని మహేశ్ పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా తన పోస్టును లవ్ ఎమోజీలు, స్మైలీలతో నింపేశారు.మహేష్ బాబు ట్వీట్ తో సింజిత్ ఎర్రమల్లి గాల్లో ఎగురుతున్నాడు. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. "నేను ఇంక ఎక్కడికి వెళ్లను మహేష్ అన్నా" అంటూ పోస్ట్ పెట్టాడు. గుంటూరు కారం లో మహేష్ బాబు డ్యాన్స్ కి కాత్యాయని సాంగ్ ను ఎడిట్ చేసి ఓ వీడియోని కూడా జోడించాడు. అంతేకాదు అర్థరాత్రి క్రాకర్స్ కాల్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

మరోవైపు డైరెక్టర్ సాయి మార్తాండ్ కూడా మహేష్ బాబుకు వీరాభిమాని. అతను కూడా సింజిత్ లాంటి కోరికనే వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏకంగా మహేష్ తన సినిమా చూసి ట్వీట్ చేయడంతో ఉబ్బితబ్బవుతున్నాడు. "థ్యాంక్యూ సో మచ్ సార్.... ఇది ఊహించిన దాని కంటే పెద్దది" అని పేర్కొన్నాడు.మహేష్ బాబు పోస్టుపై హీరోయిన్ శివానీ నాగరం స్పందిస్తూ.. "ఓ మై గాడ్. సార్... ఇది నాకు చాలా చాలా ప్రత్యేకమైంది. మీ ప్రేమ, బ్లెస్సింగ్స్ కి చాలా ధన్యవాదాలు సార్. నేను ఎల్లప్పుడూ మీకు పెద్ద అభిమానిని. మీ ట్వీట్ నన్ను ఈ వారం మొత్తం ఉత్సాహపరిచింది" అని తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది.ఇక హీరో మౌళి తనూజ్ ట్వీట్ చేస్తూ.. "చాలా థ్యాంక్స్ సార్. మాటలు లేవు. మీరు మా సినిమా గురించి ట్వీట్ చేశారంటే ఇంకా నమ్మలేకపోతున్నా. మీరు ట్వీట్ వేసినప్పటి నుంచి సింజిత్ కి మాటలు కూడా రావట్లేదు. ధన్యవాదాలు సార్" అని ఎక్స్ లో రాసుకొచ్చాడు.చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి, టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి మహేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడమే కాదు, సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనవంతు ప్రచారం అందిస్తుంటారు. ఇప్పుడు తాజా ట్వీట్ తో అభిమానుల కోరిక తీర్చిన మహేష్ గ్రేట్ అంటూ నెటిజన్లతో పాటు బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్, శివాత్మిక రాజశేఖర్ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా మహేష్ ని కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+