SSMB 29 తర్వాత మహేష్ బాబు మూవీ ఆ డైరెక్టర్ తోనే..!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 'యువరాజు' సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని సైతం తన ఖాతాలో వేసుకున్నారు. చివరగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నటించిన 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించింది.
ప్రస్తుతం మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ మూవీ షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ షూటింగ్ లో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తవగా.. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్‌లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్‌లో వర్కౌట్ చేసి మరింత ఫిట్ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సంబంధించి ఏదైనా పిక్ లీక్ అవ్వడం ఆలస్యం ఫుల్ గా వైరల్ అయిపోతుంది.
నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనే..
ఈ క్రమంలోనే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది అని జోరుగా చర్చ నడుస్తోంది. రాజమౌళితో సినిమా పూర్తి అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మహేష్ సినిమా చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. జక్కన్నతో సినిమా అంటే ఎంత టైమ్ పడుతుందో ఆయనే చెప్పలేరు. సినిమా పూర్తి అయ్యేసరికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈలోపు సందీప్.. ప్రభాస్ తో స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలను ఫినిష్ చేసేస్తాడని అంటున్నారు. గతంలో డెవిల్ అనే ఒక కథను మహేష్ బాబుకి చెప్పినట్టు సందీప్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ స్టోరీకే మెరుగులు దిద్ది తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications