మహేష్ బాబు చేతిలో మందు గ్లాసు..మద్యం మత్తు ఫొటోలు లీక్

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన.

సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు. గడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu s Rare Takkari Donga Era Party Photos Go Viral Superstar in Full Swing

అదేంటంటే... ఈ వైరల్ ఫొటోలో మహేష్ బాబుతో పాటు, ఆయన తొలి సినిమా 'టక్కరి దొంగ' దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, మహేష్ బెస్ట్ ఫ్రెండ్ సుమంత్ కనిపించారు. ఇది ఒక ప్రైవేట్ పార్టీ సందర్భానికి సంబంధించిన ఫొటోగా తెలుస్తోంది.

ఈ పిక్చర్లో దర్శకుడు జయంత్ సి. పరాంజీ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఉండగా, మహేష్ బాబు మాత్రం కొంచెం 'మత్తెక్కిన' మూడ్‌లో కనిపించారు. మహేష్ చేతిలో గ్లాస్ లేకపోయినా, ఆయన హావభావాలు, చూపు చూస్తుంటే.. మందు సేవించిన అనంతరం ఉండే ప్రత్యేకమైన 'కిక్'లో ఉన్నట్టు కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Mahesh Babu s Rare Takkari Donga Era Party Photos Go Viral Superstar in Full Swing

ఈ పార్టీకి సంబంధించిన మరికొన్ని ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఫొటోలో మహేష్ బాబు స్వయంగా డ్రింక్ గ్లాస్‌ను పట్టుకొని ఉండగా, ఇంకో పిక్‌లో మహేష్, నమ్రత కలిసి అందరూ నవ్వుతూ కనిపించారు.

Mahesh Babu s Rare Takkari Donga Era Party Photos Go Viral Superstar in Full Swing

ముఖ్యంగా, ఈ పార్టీలో సుమంత్ కళ్ళల్లో లైట్ పడటం వలన ఆయన చూపు కూడా కొంచెం 'బ్లర్'గా, అస్పష్టంగా కనిపించారు. ఈ ముగ్గురూ (మహేష్, సుమంత్, జయంత్) పార్టీ మూడ్‌లో, కాస్తా ఫుల్ జోష్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా కనిపించడంతో, ఇప్పటివరకు మహేష్‌ను చాలా సంయమనంతో, కూల్‌గా చూసిన అభిమానులు 'మన ప్రిన్స్ బాబుకు ఇలాంటి పార్టీ ఫోటోలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫొటోలు మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా సమయంలో తీసినవిగా క్లీయర్‌గా తెలుస్తోంది.

టాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఇటువంటి అరుదైన, పాత ఫొటోలు ఎప్పుడూ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తూ వైరల్ అవుతుంటాయి. ఈ త్రోబ్యాక్ పిక్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+