వైర‌ల్ అవుతోన్న మ‌హేష్‌బాబు వర్కౌట్ పిక్...

మ‌హేష్‌.. ఆ పేరులో ఓ వైబ్రేష‌న్ ఉంది. ఆ పేరు లో ఓ స్టైల్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తుంది.. అని ఓ సినిమాలో హీరోయిన్ చెప్పే డైలాగ్ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. మహేష్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్ కూడా ఇదే. మహేష్‌బాబుకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక మహేష్ కటౌట్ కి, అందానికి ఫిదా కానీ అమ్మాయిలు ఉండరు. చూడటానికి టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తూ లేడీ ఫ్యాన్స్ హృదయాల్లో నిండిపోయాడు ఈ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు...ఇప్పటికీ ఈయ‌న పాతికేళ్ల కుర్రాడిలాగే క‌నిపిస్తుంటారు. అంతలా మెయింటేన్ చేస్తుంటాడు.. అయితే, తాజాగా మ‌హేష్‌బాబు జిమ్‌లో వ‌ర్క‌ట్ చేస్తున్న ఫోటో ఒక‌టి బ‌య‌టికొచ్చింది. ఈ పిక్ కాస్తా ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్లు.. అందుకే మ‌హేష్ ఇంత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్నారు. త‌న అందానికి కార‌ణం ఇదేనంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. ఆయ‌న ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ ఒక‌టి బయటకొచ్చింది.

జ‌క్క‌న్న డైరెక్ష‌న్‌లో సినిమా : ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్నో అవాంతరాల నడుమ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు జ‌క్క‌న్న డైరెక్ష‌న్‌లో సినిమా తీస్తార‌న్న విష‌యం తెలిసిందే. మ‌హేష్‌బాబుతో రాజ‌మౌళి ఆఫ్రికన్ అడువుల్లో అడ్వెంచర్ మూవీ తీయ‌బోతున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా. ఇక ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్‌ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పాడు. అయితే పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ సినిమా కాగా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక‌, మ‌హేష్‌బాబు, రాజమౌళి కాంబీనేష‌న్‌లో సినిమా అన‌గానే అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. పైగా ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బంపర్‌ హిట్ తర్వాత జక్కన్న తెరెకెక్కిస్తున్న సినిమా కావడంతో యావత్‌ సినీ అభిమానుల్లో ఈ సినిమాపై ఆస్త‌కి నెల‌కొంది.

 Mahesh Babus workout pic going viral...

మ‌హేష్ అందానికి కార‌ణం ఇదేనా : తాజాగా, ఈ సినిమా కోసం జిమ్ లో తెగ వ‌ర్కౌట్లు చేస్తున్నాడు మ‌హేష్‌బాబు. తన బాడీని ఈ సినిమాకు తగ్గట్టు మార్చుకుంటున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండ‌బోతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌హేష్‌బాబును కూడా హాలీవుడ్ హీరో రేంజ్‌లో మార్చేప‌నిలో ఉన్నాడు రాజ‌మౌళి. ఇక దీనికి సబంధించిన పిక్ ఒకటి ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, మ‌హేష్‌బాబు చూడ్డానికి చాలా సాప్ట్‌గా ఉంటారు. ఏ సినిమాలోనైనా ఎక్కువ రిస్క్‌లు తీసుకునే పాత్ర‌లు చేయ‌డు అని అంటుంటారు చాలామంది. అయితే రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లోని ఈ సినిమా కోసం మాత్రం ప్రిన్స్ మ‌హేష్‌బాబు జిమ్‌లో తెగ వ‌ర్కౌట్లు చేసేస్తున్నాడు. మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోను త‌న అభిమానులతో పంచుకున్నాడు.

ఆ పోస్ట్‌లో.. హార్డ్ వర్క్ విషయానికి వస్తే ఏదీ ఎప్పుడూ నలుపు, తెలుపు కాదు. దానిని తీర్చిదిద్దడం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకోచ్చాడు మ‌హేష్‌బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మ‌హేబాబు ఇంత అందంగా క‌నిపించ‌డానికి కార‌ణం ఇదేనా అంటూ కొంత‌మంది నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+