ఇద్దరు అందగాళ్లు ఒకే సినిమాలో..ఫ్యాన్స్‌కు పండగే..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు వరుస చిత్రాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. అటు కుటుంబంతోనూ, ఇటు సినిమాలతోనూ తీరిక సమయం లేకుండా గడిపేస్తుంటారు. అయితే, మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమా గురించి రాజమౌళి ఇటీవలే జపాన్‌లో చేసిన వ్యాఖ్యలు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పడు తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ ప్రచారమవుతోంది. మహేష్‌బాబు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారని టాక్. అది కూడా విలన్ పాత్రలో అని అంటున్నారు. ఇంతకీ అతనెవరని తెలుసుకోవాలని ఉందా?
SSMB29లో మహేష్‌బాబుకు విలన్‌గా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ నటించబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ క్లిక్ అవుతోంది. మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా హృతిక్ రోషన్ బాగుంటారని ఇందుకోసం రాజమౌళి స్వయంగా హృతిక్‌ని కలిసినట్లు సోషల్‌మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి అనుకున్నట్లుగా జరిగితే ఒకే సినిమాలో ఇద్దరు అందగాళ్లను చూడొచ్చని నెట్టింట తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు దర్శకుడు రాజమౌళి కానీ, చిత్రయూనిట్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాజమౌళి, మహేష్‌బాబు కాంబీనేషన్‌లో వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్అంతా ఇప్పటికే పూర్తియినట్లు తెలుస్తోంది. ఇక పోస్ట్ ప్రోడక్షన్ పనులు మాత్రమే జరగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజి : ఇటీవలే జపాన్‌లో ఓ కార్యక్రమానికి హాజరయిన దర్శకుడు రాజమౌళి మహేష్‌బాబు సినిమాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, క్యాస్టింగ్ సెలక్షన్ వంటి పనులు కంప్లీట్ కాలేదని ఆయన చెప్పారు. అయితే, ఇప్పటికే ఈ సినిమాపై సోషల్‌మీడియాలో చాలా రూమర్సే వచ్చాయి. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్‌బాబు లుక్ విషయంపై నెట్టింట తెగ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మహేష్‌బాబు సినిమాలో హృతిక్ విలన్ రోల్ విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications