ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..!

దివంగ‌త సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌నవడు, ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాతో జయకృష్ణ గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీకి ఆర్ ఎక్స్ 100 మూవీని తెరకెక్కించిన అజ‌య్ భూప‌తి ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ మూవీ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఓ పక్క లైవ్ స్టోరీతో పాటు మరో పక్క పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది.

MaheshBabu Launches Teaser of SrinivasaMangapuram Jayakrishna Grandson of Superstar Krishna Debut

ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకేమనిపిస్తోంది.. నేను అసలు నీ ఫ్రెండ్ లిస్టులో ఉంటానా..? ఇదే ఫీలింగ్ జీవితాంతం ఉండేలా.. అంటూ మంగ, వాసుబాబు మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. అలాగే మంగ లేకపోతే తిరుపతి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ సాగే డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక ఈ మూవీలో వెంకటరామప్ప నాయుడు అనే పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ టీజర్ చివర్లో మోహన్ బాబు ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తానికి టీజర్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చూస్తుంటే తొలి సినిమాతోనే జయకృష్ణ బ్లాక్ బస్టర్ కొట్టేట్టు కనిపిస్తున్నాడు.

ఇక 'శ్రీనివాస మంగాపురం' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరో జయకృష్ణ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ కిడ్ ర‌షా త‌డాని నటిస్తోంది. ఇక ఈ మూవీని వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాశ్ సంగీతం మేజర్ ప్లస్ పాయింట్. టీజర్ లో మ్యూజిగ్ అద్భుతంగా ఉంది. ఇక ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+