మొగుడుకు విడాకులు..ప్రియుడుకు బ్రేకప్..కొత్త వ్యక్తిని సెట్ చేసుకున్న హాట్ బ్యూటీ..?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో ఒకటి జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది.

ఆ తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందనుకున్నారు. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయారనే వార్తలొస్తున్నాయి.
గత కొంతకాలంగా వీరద్దరు కలిసి కనిపించడం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. కలిసి దర్శనం ఇచ్చే ఈ జంట.. ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారట.ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కనిపించడం మానేశారు. ఇటీవల జరిగిన అంబానీ ఇంట పెళ్లిలో కూడా అర్జున్ కపూర్ సింగిల్‌గానే కనిపించాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌కు బ్రేక్ పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తాము వీడిపోయామని వీరిద్దరు ఎక్కడ ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రతి ఆనందం... ప్రేమపూర్వకమైన పదం... ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం' అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. దీంతో మలైకా కొత్త వాడితో ప్రేమలో పడిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మలైకా అరోరా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications