ఎంతమంది ప్రియుడులను మారుస్తావ్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది.
ప్రస్తుతం తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందనుకున్నారు. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయారు.

గత కొంతకాలంగా వీరద్దరు కలిసి కనిపించడం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. కలిసి దర్శనం ఇచ్చే ఈ జంట.. ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారట.ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కనిపించడం మానేశారు. ఇటీవల జరిగిన అంబానీ ఇంట పెళ్లిలో కూడా అర్జున్ కపూర్ సింగిల్‌గానే కనిపించాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌కు బ్రేక్ పడింది.
తాజాగా మలైకా అరోరా తన కొత్త ప్రియుడుతో కనిపించి అందరికి షాకిచ్చింది. రాహుల్ విజయ్ అనే వ్యక్తితో మలైకా రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఓ ఈవెంట్‌లో మలైకా , రాహుల్ విజయ్ ఇద్దరూ కలుసుకున్నారు. మలైకా తన చిన్ననాటి క్రష్ అని రాహుల్ విజయ్ అందరికీ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రియుడు రాహుల్ విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది మలైకా. దీంతో వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో మలైకా మళ్లీ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.












Click it and Unblock the Notifications