పెళ్లై కొడుకు ఉన్న గర్ల్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్న ప్రముఖ నటి.. ఆలయంలోనే ముద్దులు, హగ్గులు !
పిచ్చి పలు రకాలు అని.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అంటూ ఉంటారు. కొన్నేళ్ల ముందు వరకు మనుషుల్లో ఈ పిచ్చి ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అది పీక్స్ కి చేరింది. ఆ సమయానికి అలా చేయడం.. తర్వాత సరదాగా చేశామని లేదా అపార్ధం చేసుకున్నారని చెబుతూ క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది. సామాన్యులు అనుకుంటే సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు కూడా ఈ తరహాలో ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.
ఓ ప్రముఖ మలయాళ నటి.. పెళ్లై కుమారుడు ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ కి ఆలయంలో తాళి కట్టి వివాహం చేసుకుంది. అంతే కాకుండా తాను కూడా సదరు ఫ్రెండ్ తో తాళి కట్టించుకుంది. ఇక ఆ తర్వాత వారిద్దరూ ఆలయంలోనే ఒకరిని మరొకరు ముద్దులతో ముంచెత్తుకోవడం.. కౌగలించుకోవడం.. అబ్బో నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఈ తతంగం అంతా కూడా చిన్న పిల్లాడు అయిన తన ఫ్రెండ్ కుమారుడు ముందే జరుగుతుంది. అది కూడా ఆలయంలో జరుగుతుంది అనే విషయాన్ని ఆ నటి కానీ, ఆమె ఫ్రెండ్ కానీ పట్టించుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె తాళి కట్టిన.. కట్టించుకున్న ఫ్రెండ్ మగవారు కాదు ఆడవారు కావడం అందరికీ షాక్ ఇస్తుంది.

ఎవరంటే..?
ఈ కార్యాన్ని చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ప్రముఖ నటి ఎవరో కాదు.. మలయాళ బ్యూటీ ప్రార్థన కృష్ణ నాయర్. తన స్నేహితురాలు అన్సియాతో సాంప్రదాయ హిందూ వివాహ ఆచారాలతో పెళ్లి చేసుకుంది. మెడలో తాళి కట్టుకుంటూ.. దండాలు మార్చుకున్నారు. సామాజిక మాద్యమాల్లో కూడా ఈ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. దీంతో ఇది స్వలింగ వివాహంగా భావించి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు.
పెళ్లి గురించి పక్కన పెడితే.. గుడిలో ముద్దులు, హగ్గులు ఏంటని విమర్శలు చేశారు. ఓ వైపు సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను ప్రారంభించారు. స్టార్ హీరోలు, కుర్ర హీరోయిన్స్ చాలా మంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఈ తరుణంలో ఈ తరహా పని ఏంటని ఫుల్ గా ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయంపై ప్రార్ధన కాలరీతి ఇచ్చింది.
ఆ వీడియో సరదాగా పోస్ట్ చేసిన వీడియో మాత్రమేనని.. నిజమైన వివాహం కాదని వెల్లడించింది. అది కేవలం షూట్ మాత్రమేనని.. ఇతర పరిశ్రమల నటీమణులు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ట్రెండ్‌ను ఫాలో అవుతూ అలా చేశామంటూ చెప్పుకొచ్చింది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఆమెకు పెళ్లయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడని క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications