మన శంకర వరప్రసాద్ గారు: రూ.285 కోట్లు కాస్తా రూ.375 కోట్లు ఎలా అయ్యాయో?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు 'కంటెంట్' కంటే 'కలెక్షన్ పోస్టర్ల' గోలే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో గత కొంతకాలంగా వినిపిస్తున్న 'ఫేక్ కలెక్షన్ల' ఆరోపణలు ఇప్పుడు మరోసారి దుమారం రేపుతున్నాయి. తాజాగా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 285 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు చెబుతుంటే, చిత్ర నిర్మాతలు మాత్రం ఏకంగా 375 కోట్ల పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భారీ వ్యత్యాసం ఉంది

కొత్తగా సినిమా వస్తుందంటే చాలు.. వసూళ్ల విషయంలో ఒక రకమైన 'హైప్' సృష్టించడం ఆనవాయితీగా మారింది. అసలు వసూళ్లకు, నిర్మాతలు వేసే పోస్టర్లకు మధ్య దాదాపు 90 కోట్ల రూపాయల భారీ వ్యత్యాసం ఉండటం చూస్తుంటే, ఇది కేవలం అభిమానులను సంతృప్తి పరచడానికేనా? లేక సినిమాను హిట్ అని నమ్మించడానికి ఆడుతున్న డ్రామానా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజమైన వసూళ్లను దాచిపెట్టి, అంకెలను పెంచి చూపించడం ద్వారా పరిశ్రమ గౌరవాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

mana Shankara Varaprasad garu How did Rs 285 crores become Rs 375 crores

కంటెంట్ ముఖ్యం.. పోస్టర్లు కాదు

గత సంక్రాంతి సమయంలో జరిగిన ఒక సినిమా వేడుకలో ఒక యువ హీరో మాట్లాడుతూ.. "పోస్టర్లు ముఖ్యం కాదు.. కంటెంట్ ముఖ్యం. ఎన్ని కోట్లు వచ్చాయనే అంకెల కంటే, ఎంతమందిని మెప్పించామనేదే అసలైన సక్సెస్" అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అంకెలను అడ్డం పెట్టుకుని 'నెంబర్ వన్' పీఠం కోసం పాకులాడటం కంటే, నాణ్యమైన సినిమాలు తీయడంపై దృష్టి పెట్టాలని ఆ యువ హీరో పరోక్షంగా చెప్పిన మాటలు మెగా బ్యాచ్‌కు సరిగ్గా సరిపోతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ రకమైన డ్రామాలు వద్దు

కలెక్షన్ల విషయంలో ఈ రకమైన 'డ్రామాలు' ఆడటం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకోవడం భ్రమ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినిమా బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు, లేదంటే ఎంత పెద్ద హీరో అయినా తిరస్కరిస్తారు. రూ.285 కోట్ల వసూళ్లు అనేది చిన్న విషయం కాదు, కానీ దానిని రూ.375 కోట్లుగా చూపించాలనుకోవడం 'మెగా' ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నమే అవుతుంది. దీనివెనక ఎవరున్నారో తేలాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+