పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిన మంచు మనోజ్ జాతకం

సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చారు. మళ్లీ బిజీ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే మనోజ్ ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం మనోజ్-మౌనిక కలిసి కొత్తగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త వ్యాపారం గురించి ఈ స్టార్ జంట తెలిపింది. నమస్తే వరల్డ్‌ అనే పేరుతో ఒక బొమ్మల షాపును ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌లో ఈ షాప్ ను ప్రారంభించనున్నారు. ఇందులో ఉండే బొమ్మలన్నీ ఇండియాలో తయారు చేసినవే ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన బొమ్మలను ఈ షాపులోకి కలెక్ట్ చేస్తున్నారు.

Manchu Manoj horoscope completely changed after marriage

సలార్‌, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, రోబో.. అలాగే త్వరలో రిలీజ్ కానున్న ఈగల్, హనుమాన్‌ లాంటి సినిమాల్లో సూపర్ హీరోలున్నారు. ఆ పాత్రలతో గేమ్స్ ను డిజైన్ చేయనున్నట్లు ఈ జంట వెల్లడించింది. ఆ సూపర్ హీరోల పాత్రలను కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతానికి ఇంటినే కార్యాలయంగా మార్చుకొని పనిచేస్తున్నారు.

తాను చేస్తున్న ప్రయత్నం అందరికీ నచ్చుతుందని మనోజ్-మౌనిక భావిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ జంట షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. అవకాశం ఉంటే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి కూడా మనోజ్ ఆసక్తి చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+