ఆ లుక్కేంట్రా సామి: గట్టిగా ప్లాన్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సెకెండ్ ఇన్నింగ్ మంచు మనోజ్ తడాఖా చూపుతున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్నాడు. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు తర్వాత చాలాకాలం పాటు సినిమాలకు దూరం అయ్యాడు. ఒకట్రెండు సినిమాల్లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చాడంతే. గత ఏడాది మళ్లీ స్క్రీన్ పైకి వచ్చాడు. భైరవం, మిరాయ్ తో అదరగొట్టాడు. ఈ ఏడాది డేవిడ్ రెడ్డి చేస్తోన్నాడు. హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమౌతున్నాడు.
మనోజ్ పాత్ర భీకరంగా..
ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్సెస్ లో మనోజ్ పాత్ర భీకరంగా కనిపించింది. డేవిడ్ రెడ్డి 1897-1922 మధ్య కాలానికి చెందిన పీరియడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఆచార్య వేణు సినిమాటోగ్రాఫర్. అప్పట్లో విడుదలైన ఈ గ్లింప్స్ లో వార్ డాగ్ బైక్‌ను నడుపుతూ, డెత్ నోట్ అనే స్టిక్ పట్టుకుని రగ్డ్ లుక్ లో కనిపించాడు మనోజ్.

పాన్ ఇండియా లెవెల్
పాన్ ఇండియా లెవెల్ మూవీ ఇది. బ్రిటిషర్లకు మాత్రమే కాదు, భారతీయులకు కూడా శత్రువు అనే యూనివర్సెల్ కాన్సెప్ట్ తో మంచు మనోజ్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. కథ కల్పితమే అయినా కొన్ని వాస్తవ సంఘటనల నుండి పొందిన ప్రేరణతో ఈ సినిమా కథను అల్లుకున్నారు. భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల
ఈ సినిమాలో మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల అయింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లుక్ ను విడుదల చేసింది యూనిట్. దీంతో ఇది స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో తెరకెక్కిందనేది కన్ఫర్మ్ అయినట్టయింది. మోస్ట్ డేంజరస్ లుక్ లో కనిపించాడు మంచు మనోజ్. ఒంటికి నల్లరంగు పులుముకుని, ఓ మారణాయుధాన్ని భుజంపై పెట్టుకుని సీరియస్ లుక్స్ లో దర్శనం ఇచ్చాడు. ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.
A whole new dimension within me.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
Raw. Ruthless. Unapologetic.#DavidReddy pic.twitter.com/vRjG7Rlm4y












Click it and Unblock the Notifications