రామ్ చరణ్ పైనా.. చిరంజీవి-మోహన్ బాబు విబేధాలపై మంచు మనోజ్ వ్యాఖ్యల సంచలనం!!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య విబేధాలు ఉన్నాయని అనేకమార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనేక సందర్భాలలో బాహాటంగానే ఈ విషయం కూడా స్పష్టమైంది. అయితే తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య వివాదంపై మరోమారు క్లారిటీ వచ్చింది.
నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో మంచు మనోజ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలలో మనోజ్ తో పాటు నిఖిల్, కిరణ్ అబ్బవరం, బాబి, దర్శకులు బుచ్చిబాబు తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు హాజరై ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తనకు ప్రాన్స్ స్నేహితుడని, చరణ్ మంచి నటుడు మాత్రమే కాదు అంతకుమించి గొప్ప మంచి మనసున్న వ్యక్తి అని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే రామ్ చరణ్ చలించిపోతారని చెబుతూ అందుకు సంబంధించి గతంలో జరిగిన ఒక ఉదంతాన్ని వెల్లడించారు.
2018లో తాను అమెరికాలో ఉన్న సమయంలో దుబాయ్ లో ఉంటున్న ఒక తెలుగు కుటుంబం తీవ్రమైన సమస్యల్లో ఉందని తెలిసి తన వంతుగా సహాయం చేసి, ఒక ఐదు లక్షల రూపాయలు తగ్గాయని రామ్ చరణ్ ను అడిగానని చెప్పారు. వెంటనే స్పందించిన రాంచరణ్ బ్యాంక్ వివరాలు పంపమని చెప్పాడని, వివరాలు పంపిన వెంటనే వారికి డబ్బులు పంపించాడని మంచు మనోజ్ గుర్తు చేశారు.
ఆయన సహాయం చేసిన వారి కుటుంబాల ఆశీస్సులు రామ్ చరణ్ కు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య ఉన్న విభేదాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్ గతంలో కూడా తనను ఒకరు చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య విభేదాలు ఉండగా మీరిద్దరూ ఇంతకాలంగా ఎలా స్నేహితులుగా ఉంటున్నారు అని అడిగారన్నారు.
అందుకు తాను భార్యాభర్తల విషయాల్లో కలుగజేసుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా అంటూ ప్రశ్నించాను అని చెప్పారు. చిరంజీవి మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, వారిది 45 ఏళ్ల అనుబంధం అని, వాళ్ళిద్దరూ అలాగే ఉంటారని మంచు మనోజ్ పేర్కొన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications