ఓటీటీలోకి కన్నప్ప మూవీ.. మంచు విష్ణు క్లారిటీ
భారతీయ చిత్ర సీమలో మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూన్ 27న విడుదలకు సిద్ధమైంది.
అయితే కన్నప్ప ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. కన్నప్ప ఓటీటీ డీల్ గురించి ఆయన వెల్లడించారు. కన్నప్ప సినిమా హిట్ అయితేనే ఓటీటీ డీల్ కుదురుతుందని తెలిపారు.
కన్నప్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రొమోషన్లలో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కన్నప్ప మూవీ ఓటీటీ డీల్ కుదిరిందా? అని పలువురు ప్రశ్నలు అడగ్గా మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు.
ఈ మూవీ తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో వాయిదా పడింది. ఇక జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమైంది.

ఇక ఈ మూవీలో మంచు విష్ణు కన్నప్ప టైటిల్ రోల్ చేస్తున్నారు. అంతేకాకు మోహన్‌బాబు, ప్రీతి ముకుందన్, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, కాజల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications