రామాయణం చేస్తా.. రావణుడిగా ఆయనే అంటున్న మంచు విష్ణు !
మంచు విష్ణు... తెలుగు సినీ పరిశ్రమకు మంచు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో రాణిస్తూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ లో పలు విజయాలు దక్కించుకున్నప్పటికీ.. స్టార్ హీరో రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయారు.
ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ.. రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ 'రుద్ర' పాత్రలో కనిపించగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే విష్ణు ముగ్గురు పిల్లలు కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ, తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో నెమ్మదించింది. అయితే ఈ మూవీలో ప్రీతి ముకుందన్‌తో రొమాన్స్ సన్నివేశాలు ఉండటంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మంచు విష్ణు చేసిన రామాయణం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
విష్ణు ఏమన్నారంటే..?
రావణుడి జననం నుండి మరణం వరకు స్క్రిప్ట్ రెడీగా ఉంది. 2009లోనే ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాను. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలని, రాముడి పాత్రకు సూర్యను తీసుకోవాలని, సీత పాత్రకు ఆలియా భట్‌ను అనుకున్నాను. కానీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రావణుడిగా నా తండ్రి మోహన్‌బాబు కాకుండా మరొకరిని ఊహించలేను అంటూ చెప్పుకొచ్చారు.
“I already have a script on Ravana, from his birth to death. In 2009, I approached #Suriya to play Rama, with Raghavendra Rao as director. Due to budget issues, it didn’t happen. I cannot think of anybody other than my father as Ravana.”
— Whynot Cinemas (@whynotcinemass_) July 19, 2025
- #ManchuVishnu
pic.twitter.com/YebQkVcyqF
కన్నప్పను కూడా డివోషనల్ సినిమాగా చెప్పి ఇలా చేశావు.. ఇప్పుడు రామాయణం కూడా అలా చేస్తావా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. "వద్దు బాబోయ్ మీకో దండం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి విష్ణు వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications