అల్లు అర్జున్ అరెస్ట్‌తో ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడింది - మంచు విష్ణు
తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి అంటూ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు ఆ తరం నుంచి ఈ తరం వరకు నటిస్తూనే ఉన్నారు. విలన్‌గా, హీరోగా, నటుడుగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మోహన్ బాబు వారసులు సైతం ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. మోహన్ బాబు కూతురు సైతం సినిమాల్లో నటిస్తున్నారు. అయితే మోహన్ బాబు వారసులు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు వన్ ఇండియా తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావాలంటే వారసత్వం ఒక్కటే ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండలంటూ మంచు విష్ణు తెలిపారు.టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీలో నిలబడడం కష్టమని ఆయన అన్నారు. నా తొలి సినిమా ఫెయిల్ అయినప్పటికీ,నాలో టాలెంట్ ఉందని ప్రేక్షకులు గుర్తించడం వల్లే తాను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగ గలిగానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా స్పందించారు.ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెలబ్రిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయ్యిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక తాను నటిస్తూ, నిర్మిస్తోన్న కన్నప్ప మూవీపై కూడా ఆయన స్పందించారు. కన్నప్ప మూవీ కోసం చాలా కష్టపడుతున్నాం జనాలకు ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications