రూ.10 కోట్లు గెలుచుకునే ఆఫర్ ఇస్తున్న మంచు విష్ణు..
మంచు విష్ణు... తెలుగు సినీ పరిశ్రమకు మంచు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో రాణిస్తూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ లో పలు విజయాలు దక్కించుకున్నప్పటికీ.. స్టార్ హీరో రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయారు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.
విష్ణు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీలో.. ప్రభాస్ 'రుద్ర' పాత్రలో కనిపించారు. అలానే మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ సహా పలువురు ముఖ్యపాత్రల్లో నటించారు.

ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టిన విష్ణు సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కాగా హీరోగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు విష్ణు. ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించి హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టారు. షార్ట్ ఫిలిమ్స్ పోటీని ప్రకటించారు. అయితే అందులో విజేతలకు కళ్లు చెదిరే ఆఫర్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ - సీజన్ 1ను పేరుతో పోటీని ప్రకటించారు. ఈ షార్ట్ ఫిలిం పోటీలో పాల్గొనేవారు కనీసం 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం తెరకెక్కించాలని తెలిపారు. కథ చెప్పడం, దర్శకత్వం టాలెంట్ ను బట్టి విజేతలను నిర్ణయించనున్నారు. ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications