Manchulakshmi: 'పూకీ' టైటిల్ పై మంచు లక్ష్మి కామెంట్స్.. వీడియో వైరల్..

ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ అక్క కొడుకు అజయ్ దీషన్ హీరోగా నటించిన కొత్త తమిళ చిత్రం 'పూకీ'. సలీమ్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన గణేశ్ చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ధనుషా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. అలాగే పూకీ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలోనూ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 13 న విడుదలైంది.

ఈ సినిమా ప్రొమోషన్లలో భాగంగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పూకీ టైటిల్ అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. అది తమిళంలో వాడుక భాష అని పూకీ అంటే క్యూటీ అని అర్థం వస్తుందని అన్నారు. ఎవరినైనా పూకీ అని పిలుస్తే క్యూటీ అని అర్థం అన్నారు. కానీ యంగ్ స్టర్స్ లో ఇది వాడుక పదం అని కామెడీ పంచారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అంతేకాక మంచు లక్ష్మి నిర్మాతగా తన ప్రయాణానికి ముగింపు పలికినట్లు తెలిపారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన సినిమా వల్ల వచ్చిన నష్టాలను ఇప్పటికీ భరిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇకపై సినిమాలు నిర్మించే ఆలోచన లేదని, పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ManchuLakshmi Viral Comments on Pookie Title Hilarious Take at Movie Event Goes Viral Now

ఇక ఈ మూవీ నిర్మాత, నటుడు విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు గణేశ్‌ చంద్రను తానే సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశానని అన్నారు. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నటుడు అజయ్‌ దీషన్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఊహించని పలు విషయాలు ఈ మూవీ ద్వారా జరిగాయన్నారు. ఈ కథ తనను బాగా బాధ పెట్టిందని ఎమోషనల్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+