మంచు విష్ణు సంచలన వీడియో.. మై ఫ్యామిలీ సేఫ్..!

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఏకంగా 8 దేశాలలో ఉన్న యూఎస్ బేస్ క్యాంపులపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది.

మంచు విష్ణు.. తన ఫ్యామిలీని కలిసేందుకు దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ లో ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. వీడియో చూస్తుంటే అక్కడి భయానక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆకాశంలోకి క్షిపణులు దూసుకురావడం, వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలు తన కళ్లముందే జరుగుతున్నాయని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ManchuVishnu in Dubai Shares Missiles Footage viral Family Safe as Tensions Rise in Middle East

అయితే క్షిపణుల ధాటికి తాము బస చేసిన ఇళ్లు దద్దరిల్లిపోయిందని మంచు విష్ణు అన్నారు. అంతేకాక యుద్ధం శబ్దాలకు తమ చిన్నారి ఐరా ఒక్కసారిగా భయపడిందని తెలిపారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ఇక పౌరుల భద్రత కోసం దుబాయ్ సైన్యం శ్రమిస్తోందని మంచు విష్ణు తన పోస్టులో తెలిపారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ సైన్యం వల్లే తాము క్షేమంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం మంచు విష్ణు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+