బికిని వేసుకోమని అతను ఒత్తిడి చేశాడు..స్టార్ హీరోయిన్

హీరోయిన్ మనీషా కొయిరాలా అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 1990ల్లో అభిమానులకు మనీషా కొయిరాలా సుపరిచితురాలే. ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకే ఒక్కడు, దిల్‌సే వంటి సూపర్ హిట్లతో మనీషా కొయిరాలా స్టార్ హీరోయిన్‌గా మారింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో భర్తకు సామ్రాట్ దహల్‌ విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు మనీషా కొయిరాలా చాలామందితో ప్రేమాయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Manisha Koirala shares bikini incident

ఇదిలా ఉంటే మనీషా కొయిరాలా తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ సమస్యతో పోరాడి గెలిచింది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది .హిరామండి వెబ్ సిరీస్ ద్వారా తిరిగి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మనీషా కొయిరాలా తన కెరీర్‌లో ఎదురైన ఓ ఘటన గురించి ఆమె వెల్లడించారు.

తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ఫొటోషూట్ చేశానని, అయితే ఓ ఫొటోగ్రాఫర్ నేను పెద్ద సూపర్ స్టార్ అవుతానని చెప్పి పొగిడాడు. ఆ తర్వాత టూ పీస్ బికినీ తీసుకొచ్చి వేసుకోమని చెప్పాడు. కానీ నేను అంగీకరించలేదు. ఆ డ్రెస్ నేను స్విమ్మింగ్ చేసే సమయంలోనే వేసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పానని మనీషా కొయిరాలా తెలిపారు. దీంతో ఆయన నన్ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారు చేయలేరు అని వెళ్లిపోయాడు. అతడి మాటలను నేనెప్పటికీ మర్చిపోలేను. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదని అప్పుడే అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నా సినిమాలు హిట్ అయ్యాక.. నేను పెద్ద సెలబ్రెటీ అయ్యాక అతడే వచ్చి నా ఫోటోషూట్ చేశాడు" అంటూ గుర్తుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+