మాజీ సీఎం మనవడితో మాజీ విశ్వసుందరి, ప్రముఖ హీరోయిన్ డేటింగ్!!
మాజీ విశ్వసుందరి బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ గురించి హాట్ న్యూస్ ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మానుషి చిల్లర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఆమె ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మానుషి చిల్లర్ తో వీర్పహారియా డేటింగ్
తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మేరకు బాలీవుడ్ లో ఆసక్తికర చర్య జరుగుతుంది. బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒకరు మానుషీ వీర్ భుజం పైన తలపెట్టి సేద తీరుతున్న ఒక పోస్ట్ ను వ్లాగ్ లో షేర్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరి పైన చర్చ జరుగుతుంది.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పోస్ట్ తో రచ్చ
బాలీవుడ్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రి తాను జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా తో కలిసి ఒక టూర్ కు వెళ్లినట్టు అక్కడ జాన్వీ కపూర్ ఫోటో షూట్ లో బిజీగా ఉన్నట్టు ఫోటోలతో వ్లాగ్ రాశారు.అయితే ఆ ఫోటోలో జాన్వీ కపూర్ తో పాటు మానుషి మరియు వీర్ పహారియా కూడా ఉండటం తో చర్చ మొదలైంది.
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ వీరి హంగామా
ఈ ఫోటోలో వీర్ భుజంపై మానుషి తలపెట్టి సేద తీరుతుంది. ఇక దీంతో వీరిపై వస్తున్న డేటింగ్ రూమర్లకు బలం చేకూరినట్టు అయింది. అంతకుముందు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లోను మనిషి చిల్లర్ వీర్ పహారియా కలిసే స్టెప్పులు వేశారు. దీంతో వీరిద్దరి డేటింగ్ రామాయణం పైన ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా చర్చ కొనసాగుతుంది.
సినిమాలలో పెద్దగా రాణించలేకపోతున్న మానుషి చిల్లర్
ఇదిలా ఉంటే హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషి చిల్లర్ విశ్వసుందరిగా 2017 లో విజయం సాధించి ఆ తరువాత సినిమాలలోకి ఆరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా తొలి చిత్రంలో నటించిన మానుషి చిల్లర్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా సినిమాలలో రాణించలేక పోతుంది .ఇక తెలుగులోను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.
మహారాష్ట్ర మాజీ సీఎం మనవడుతో డేటింగ్ లో మానుషి చిల్లర్
ఇది ఇలా ఉంటే మానుషి చిల్లర్ తో డేటింగ్ చేస్తున్న వీర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు. ఇతను కూడా సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్కై ఫోర్స్ సినిమాతో తొలిసారి నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఇదే సమయంలో మానుషి చిల్లర్ తో డేటింగ్ నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు.












Click it and Unblock the Notifications