పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన విజయ్ - రష్మిక.. క్రేజీ క్యాప్షన్స్ !!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ హోటల్స్ వేదికగా వీరి వివాహ వేడుక నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన కొద్దిమంది మిత్రుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను (virosh wedding pics) విజయ్, రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ జంట 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు 'హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ ' అని రష్మిక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలానే విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో.. "ఒకరోజు తను గుర్తొచ్చింది. తను పక్కన లేకపోతే నా రోజు అసంపూర్ణంగా అనిపించింది. తను ఎదురుగా కూర్చుని ఉంటేనే నా భోజనం సంపూర్ణంగా అనిపించేది. తనతో కలిసి వర్కౌట్లు చేస్తే అవి శిక్షలా కాకుండా సరదాగా అనిపించేవి. నేను ఎక్కడ ఉన్నా, ఇల్లు అనే భావన, ప్రశాంతత కలగాలంటే తను కావాలనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాలినే నా భార్యగా చేసుకున్నా" అంటూ రాసుకొచ్చారు.
మరీ ముఖ్యంగా ఈ వివాహ వేడుక ఓ ప్రత్యేకతను చాటుకుంది. విజయ్ తెలుగు సంప్రదాయాలను, రష్మిక కూర్గ్‌లోని కొడవ వలస వారసత్వాన్ని కలిపి.. ఈ వివాహాన్ని రెండు విభిన్న సాంస్కృతిక గుర్తింపుల అందమైన సమ్మేళనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన హిందూ ఆచారాలకు విరుద్ధంగా, కొడవ వివాహాలు కుటుంబ సంప్రదాయాలు, పూర్వీకుల పట్ల గౌరవం, వారి సైనిక వారసత్వంపై ఆదరపడి ఉంటాయి. చారిత్రాత్మక సైనిక వారసత్వం, విలక్షణమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందిన కొడవర్లు, విస్తృతమైన వేద ఆచారాల కన్నా కుటుంబ ఆశీర్వాదాలకు, సామూహిక అనుబంధానికి ప్రాధాన్యతనిస్తారు.












Click it and Unblock the Notifications