నీ కెరీర్‌లోనే వరస్ట్ కలెక్షన్లు అన్నా.. !
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'మాస్ జాతర' చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, నవంబర్ 1, శుక్రవారం నుంచి ప్రీమియర్స్ రూపంలో థియేటర్లలో సందడి చేస్తోంది. రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థల నుంచి రావడం అంచనాలను పెంచింది.
అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ 'మాస్ జాతర'కు ఊహించని సవాల్ ఎదురైంది. అక్టోబర్ 31న విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న 'బాహుబలి: ది ఎపిక్' సినిమా కారణంగా, 'మాస్ జాతర' విడుదల వ్యూహంలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా, మేకర్స్ పూర్తి స్థాయి రిలీజ్‌ను పక్కన పెట్టి, ప్రీమియర్స్‌కే పరిమితం కావడంతో.. తొలి రోజు వసూళ్లపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం, 'మాస్ జాతర' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు కేవలం ₹61 లక్షలకే పరిమితమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు నమోదైన ఈ సంఖ్య.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కోటి మార్కును కూడా దాటలేకపోవడం, ప్రస్తుత పోటీ తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాక, ప్రీమియర్స్ సాయంత్రం మాత్రమే మొదలవడం, షోలు తక్కువగా వేయడం కూడా వసూళ్లు తగ్గడానికి కారణమైంది.
అయినప్పటికీ, ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డే కలెక్షన్లు ₹2 నుంచి 3 కోట్ల మధ్య ఉండవచ్చు. ఇది రవితేజ గత చిత్రం మిస్టర్ బచ్చన్ తొలి రోజు వసూళ్ల (₹3.45 కోట్లు) కంటే తక్కువ కావడం గమనార్హం.
సాధారణంగా మాస్ మహారాజా సినిమాలకు వారాంతంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వీకెండ్ (శని, ఆదివారాలు) రిలీజ్ కావడం నిర్మాతలకు కలిసి వచ్చే అంశం. కనుక, తొలి రోజు వచ్చిన రివ్యూలు, మౌత్ టాక్ ఆధారంగా 'మాస్ జాతర' వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది. రవితేజ తనదైన ఎనర్జీతో ఈ బాక్సాఫీస్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
-
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..!












Click it and Unblock the Notifications