'మాస్ జాతర' ట్విట్టర్ రివ్యూ..టాక్ ఇలా ఉందేంటి..!
మహారాజా రవితేజ నటించిన 'మాస్ జాతర' చిత్రం అక్టోబర్ 31న ప్రీమియర్‌లతో ప్రేక్షకుల ముందుకు రాగా, సోషల్ మీడియా (ముఖ్యంగా ట్విట్టర్/X)లో అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది. ఈ 'మాస్ జాతర' ఎలా ఉందనే దానిపై నెటిజన్లు పంచుకున్న హైలైట్స్ ఇక్కడ చూడండి:
రవితేజ అభిమానులు ఈ సినిమాను 'వింటేజ్ రవితేజ' షోగా అభివర్ణించారు. తన మార్క్ స్వాగ్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కామెడీ టైమింగ్‌తో రవితేజ సినిమాను తన భుజాలపై మోశారని ఫ్యాన్స్ ట్వీట్ చేశారు.

ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు .ఇది మాస్ మహారాజా వింటేజ్ ఫామ్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే ఎస్సై భేరి లక్ష్మణ్ పాత్రలో రవితేజ నటన, ఉత్తరాంధ్ర యాసలో పలికిన డైలాగ్‌లు పీక్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు. హీరో ఇంట్రో సీన్, యాక్షన్ బ్లాక్‌లు, క్లైమాక్స్‌లో రవితేజ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్స్గా నిలిచాయని నెటిజన్లు చెబుతున్నారు.
#MassJathara
— Shreyash Media (@ShreyashMedia) October 31, 2025
Just Watched now
3.75/5
DOP Best work in recent times
Bheems given Blockbuster tunes and BGM
Fights 🥵💥#RaviTeja performance 💥🥵🔥
Crowd will pull this mass Jathara easily
Congratulations to @BhanuBogavarapu pic.twitter.com/iNEHCMi1bk
సినిమా ప్రథమార్థం ఫుల్ మాస్ ట్రీట్‌గా ఉందనీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్, కామెడీతో ఎంగేజింగ్‌గా సాగిందని ప్రేక్షకులు తెలిపారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా కుదిరిందని ట్వీట్‌లలో కనిపిస్తోంది.శ్రీలీల గ్లామర్, డ్యాన్స్‌లు సినిమాకు ప్లస్ అయ్యాయని, 'ధమాకా' తర్వాత ఈ కాంబో మళ్లీ బాగా వర్కౌట్ అయిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
Blockbuster #Massjathara
— Triganana Dhootha (@TrigananaDhoota) October 31, 2025
Vikramarkudu>Mass jathara>Kick>Krack#Raviteja #Sreeleela #MassJatharaReview #MassJathara pic.twitter.com/rZ0SRpvD2k
సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి మాస్ మూవ్‌మెంట్, ఎలివేషన్ సీన్‌ను బాగా హైలైట్ చేసిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ బీజీఎం అదరగొట్టిందని ట్విట్టర్‌లో ప్రశంసలు దక్కాయి. విలన్‌గా నవీన్ చంద్ర పండించిన విలనిజం బాగుందని, హీరో-విలన్ మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు.
Mass jathara title ki nyayam chesar ga @BhanuBogavarapu 🤝👌
— Hari Sai CHANDU (@HariSaiCHANDU1) October 31, 2025
Ravanna screen presence and vintage moments anni work ayyai
Very good 1st half ah bgm inka mind loney undhi🥵#MassJathara pic.twitter.com/hM0J6CtmVR
రవితేజ ఎనర్జీపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినా, కొంతమంది ప్రేక్షకుల నుంచి కథనంపై మిశ్రమ స్పందన వచ్చింది.సినిమా కథాంశం కొంచెం పాత చింతకాయ పచ్చడిలా రొటీన్‌గా అనిపించిందని, సెకండాఫ్ కొన్ని చోట్ల స్లో అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.దర్శకుడిగా పరిచయమైన భాను భాగవతుపు.. ఫైట్స్, కామెడీని బాగా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినా, పాత మాస్ మసాలా కథను ఎంచుకోవడం వల్ల కొంత నిరాశ కలిగిందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
Jathara Fight Will Blow Your Mind 💥🔥
— Tarak! (@nottarak) October 31, 2025
Mass Maharaj Ni Ooora Mass Ga Chustharu 🔥🧨💥#MassJathara #RaviTeja #Sreeleelapic.twitter.com/1G5yjdyj2o
'మాస్ జాతర' ట్విట్టర్ రివ్యూల ప్రకారం, ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్.. రొటీన్ కథ ఉన్నప్పటికీ, రవితేజ వన్-మ్యాన్ షో , ఆయన మార్క్ ఎనర్జీ, ఫైట్స్, కామెడీతో అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చిందని తేలింది. అంచనాలు లేకుండా కేవలం రవితేజ స్వాగ్ చూడాలనుకునే వారికి ఇది పండగేనని నెటిజన్లు చెబుతున్నారు.
-
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications