'సార్' సినిమా రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా..? నీ నెత్తిన దరిద్రం ఉంటే ఏం చేస్తారు
టాలీవుడ్‌లో విజయవంతమైన ఫార్ములాను బ్రేక్ చేస్తూ, సామాజిక సందేశంతో కూడిన సినిమాలకు కూడా భారీ కలెక్షన్లు వస్తాయని నిరూపించిన చిత్రం 'సార్' (తమిళంలో 'వాతి'). 2023లో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సత్తా చాటింది. కేవలం రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది.
హీరో ధనుష్ నటన, సంయుక్త మీనన్ గ్లామర్, దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.అయితే, ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా చేసిన వ్యాఖ్యల ప్రకారం... 'సార్' కథను ఆయన మొదట హీరో రవితేజ కోసం సిద్ధం చేసుకున్నారట.

మాస్ మహారాజా రవితేజకు ఈ కథ వినిపించడం జరిగిందట, కానీ అప్పటికే ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్‌లో ఉండటం కారణంగా 'సార్' సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంకీ అట్లూరి ఈ కథను స్టార్ హీరో ధనుష్ వద్దకు తీసుకెళ్లారు. కథ వినగానే ధనుష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రాజెక్ట్ పట్టాలెక్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశమైంది: రవితేజ ఈ సినిమా చేసి ఉంటే, ఆయన కెరీర్‌లో ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచేదని, ఒక మంచి అవకాశాన్ని రవితేజ పోగొట్టుకున్నారని టాక్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications