ఈ సంవత్సరంలో అది పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే..!
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయిన వరుణ్ తేజ్, ఫిదా సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు. కంచె, తొలిప్రేమ, f2,f3, గద్దలకొండ గణేష్, అంతరిక్షం వంటి వరుస హిట్‌ను సొంతం చేసుకున్నాడు. మెగా ట్యాగ్‌కు దూరంగా ఉన్న వరుణ్ తేజ్ వరుస హిట్లను సాధిస్తూ స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ నుంచి సరైన సినిమాలు రావడం లేదు. గాండీవధారి అర్జున, గనీ వంటి ప్లాప్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని మరీ 'మట్కా' అనే మాస్ ఎంటర్‌టైనర్‌తో థియేటర్లలో సందడి చేశాడు.
ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. వరుణ్ కి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. 'మట్కా' టీజర్, ట్రైలర్లకి.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా, డైలాగ్స్ బాగా పేలాయి. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు సైతం భారీగా పడిపోయాయి.నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగా వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీ హైప్ క్రియోట్ చేసిన మట్కా మూవీ మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసిందంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.18 CR
సీడెడ్ - 0.06 CR
ఉత్తరాంధ్ర - 0.09 CR
ఈస్ట్ - 0.05 CR
వెస్ట్ - 0.03 CR
గుంటూరు - 0.03 CR
కృష్ణా - 0.06 CR
నెల్లూరు - 0.02 CR
ఏపీ + తెలంగాణ (టోటల్) - 0.52 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.12 CR
వరల్డ్ వైడ్ టోటల్ - 0.64 కేర్
మొదటి రోజు కేవలం రూ.0.64 కోట్ల షేర్ ను రాబట్టింది.
వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మట్కా సినిమా అత్యంత డిజాస్టర్‌గా సినీ పండితులు తేల్చేస్తున్నారు. వరుస ప్లాప్‌లతో ఈ మెగా హీరో హ్యాట్రిక్ కొట్టినట్టు అయింది.












Click it and Unblock the Notifications