తెలుగులో ఈ సినిమా ఆడింది 5 రోజులు.. ఐదో రోజు ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు
తెలుగులో ఒక సినిమా ఆడిందంటే దానికి అనేక కారణాలుంటాయి. మంచి కథ, దర్శకత్వ ప్రతిభ, నిర్మాణ విలువలు, నటీనటుల అద్భుతమైన ప్రతిభ, సంగీతం, 24 విభాగాల ప్రతిభ కలగలిసి ఆ సినిమాను ఒక ఆణిముత్యంలా నిలబెడుతుంది. సినీ చరిత్రలో ఒక పేజీని లిఖిస్తుంది. అయితే ఒక సినిమా ఫ్లాపైందంటే దానికి కూడా కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని విభాగాలు అద్భుతంగా పనిచేసినా, కథ, కథనాల్లో లోపం ఉండటం, దర్శకత్వ ప్రతిభ లోపించడం, అనుకన్నదారిలో కాకుండా వేరేదారిలో సినిమా నిర్మాణం సాగడంలాంటివి అనేకం కలిసివుంటాయి. ఇలా వచ్చి దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకున్న సినిమానే వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా.
10 మంది కంటే ఎక్కువ లేరు
బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కేవలం 5 రోజులు ఆడితే ఐదోరోజు కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదంటే ఎంత దారుణమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో, పీరియడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే అత్యంత దారుణమైన నెగటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండో రోజు నుండే చాలా చోట్ల థియేటర్లు వెలవెలబోయాయి. కొన్ని చిన్న సెంటర్లలో, సింగిల్ స్క్రీన్లలో మార్నింగ్ షోలకు 10 మందికంటే తక్కువమందే వచ్చారుకానీ కనీసం 11 మంది కూడా రాలేదు.

షోలన్నీ థియేటర్లు రద్దు చేశాయి
ప్రేక్షకులే లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల యాజమాన్యాలు షోలను రద్దు చేశాయి. మట్కా సుమారు రూ. 25 కోట్ల నుంచి రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, రూ.5 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా, అతని కెరీర్ లో మచ్చగా మిగిలిపోయింది. 2024 నవంబరు 14న విడుదలైన ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. విజేందర్ రెడ్డి, రజని తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 1958 నుంచి 1982 మధ్య విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన మట్కా కింగ్ రతన్ ఖేత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాని తెరకెక్కించారు. గ్యాంగ్ స్టర్ డ్రామా రూపుదిద్దుకొని, కథలో ఎటువంటి కొత్తదనం లేక దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.












Click it and Unblock the Notifications