Meena: అదృష్టం అంటే ఈ హీరోయిన్ దే.. ఒకేసారి రూ. 100 కోట్లు వచ్చిపడ్డాయి..!!

నటి మీనా మనందరికీ సుపరిచితమే.. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు మీనా. తమిళ ఇండస్ట్రీలోకి రంగం ప్రవేశం చేసి రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్, శరత్‌ కుమార్, అజిత్ లాంటి బిగ్ స్టార్స్ తో నటించారు. ఆ తర్వాత తెలుగులోనూ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, సుమన్, శ్రీకాంత్ ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించారు. అయితే ప్రస్తుతం సినిమాలను తగ్గించేశారు మీనా. ఇక తాజాగా ఆమెకు జాక్ పాట్ తగిలినట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఆమె నివసిస్తున్న ఓ ఇంటిని కోట్ల రూపాయలకు అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి.

నటి మీనా 20 ఏళ్ల క్రితం కొన్న ఓ ఇంటిని ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్లకు అమ్మేశారట. మీనా స్మార్ట్ బిజినెస్ టాలెంట్ ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం మీనా చాలా రిస్క్ చేసి ఆ ఇంటిని కొనుగోలు చేశారట. అప్పట్లోనే బ్యాంకుల ద్వారా రూ. 10 కోట్లు లోన్ తీసుకుని తమిళనాడులో ఓ పెద్ద హెరిటేజ్ భవనాన్ని కట్టించారు మీనా. అయితే అప్పట్లో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారట.

అయినా ఆమె తన బంగ్లాను సంప్రదాయ వాస్తు శైలిలో నిర్మించారు. చెక్కిన చెక్క స్తంభాలు, విశాలమైన ప్రాంగణం, ప్యాలెస్ డిజెన్ తో ఇంటిని తీర్చిదిద్దారు. అయితే తాజాగా ఈ ఇంటిని చూసి అమెరికాకు చెందిన ఓ జంట ఫిదా అయ్యారట. ఆ ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారట. దాంతో ఆ ఇంటిని మీనా రూ. 100 కోట్లకు అమ్మినట్లు సమాచారం. రూ. 10 కోట్లకు కట్టిన ఇంటిని రూ. 100 కోట్లకు అమ్మిన మీనా టాలెంట్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

Meena Actress Sells House Bought for 10 Crore 20 Years Ago for Staggering 100 Crore Meena house

ఇక మీనా ప్రస్తుతం దృశ్యం 3 సినిమాలో నటిస్తోంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. అంతకుముందు రిలీజ్ అయిన దృశ్యం 2, దృశ్యం సినిమాల్లోనూ మీనా నటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+