ఆ హీరోతో రెడ్ హ్యెండెడ్‌గా దొరికిపోయిన స్టార్ హీరోయిన్
మీనాక్షి చౌదరి .. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ భామ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది.
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.అలాగే దుల్కర్ సల్మాన్‌తో నటించిన లక్కీ భాస్కర్ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

వీరిద్దరు కలిసి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'సినిమాలో నటించారు. సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరు కలిసి ఒకేచోట దర్శనం ఇచ్చారు.
మీనాక్షి చౌదరి, సుశాంత్ ఎయిర్ పోర్ట్‌లో జంటగా కనిపించడం సంచలనంగా మారింది. దీంతో ఈ వీరి డేటింగ్ నిజమే అని అంతా భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంపై ప్రేమ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications