గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !!

మెగా బ్రదర్ నాగబాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మెగా ఫ్యామిలీకి చెందిన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ లతో కలిసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా టెలివిజన్, రాజకీయ రంగాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. మొదట చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. రుద్రవీణ, త్రినేత్రుడు, అంజి, గీత గోవిందం, చందమామ వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

కాగా నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా నాగబాబు తన ప్రతిభను నిరూపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ తో ఆయన "Orange" సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. కాలక్రమేణా మంచి కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా నాగబాబు మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా కామెడీ షోలలో జడ్జ్‌గా ఆయనకు ప్రత్యేక క్రేజ్ వచ్చింది. యువ కమెడియన్లను ప్రోత్సహించడం ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలను నేరుగా చెప్పే వ్యక్తిగా గుర్తింపు పొందారు.

mega-brother-nagababu-name-tattoo-on-jabardasth-comedian-kirrak-rp-heart-and-comments-goes-viral

ప్రముఖ ఛానల్ లో పరసం అయ్యే "జబర్దస్త్" కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రొగ్రాంకు ఎన్నో ఏళ్ల పాటు నాగబాబు, నటి రోజా జడ్జిలుగా వ్యవహరించారు. ఎంతో మంది కమెడియన్లు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ కార్యక్రమం ద్వారానే పరిచయం అయ్యారు. అయితే ఈ నటుల్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మిగతా వారు కూడా చేయూతగా నిలుస్తారని చెబుతుంటారు. ఎవరికి ఇబ్బంది ఉన్న నాగబాబు ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారని.. అందుకే ఆయనంటే చాలామందికి అభిమానమని పలు ఇంటర్వ్యూల్లో సైతం వ్యాఖ్యానించారు. కానీ ఓ కమెడియన్ మాత్రం నాగబాబుపై తనకున్న ప్రేమను చాటుతూ ఏకంగా తన గుండెలపై ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

ఇంతకీ ఎవరా కమెడియన్ అనుకుంటున్నారా ? అతనే కిర్రాక్ ఆర్పీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు లోని గొప్పతనం, ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఎంతో మందికి సహాయం చేసిన, అన్నం పెట్టిన గొప్ప మనసున్న వ్యక్తి నాగబాబు అని ఆర్పీ కొనియాడారు. వ్యక్తిగతంగా ఆయనతో ఎక్కువ భావోద్వేగాలను పంచుకున్న వారిలో తాను ఒకడిని వెల్లడించారు. నాగబాబు తన తండ్రి లాంటి వ్యక్తి అని.. అందుకే ఆయనను అభిమానిస్తానని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును తన గుండెపై వేయించుకోవాలని అనిపించి టాటూ వేయించుకున్నట్టు ఓపెన్ అయ్యారు.

ఇక రాజకీయ రంగంలోకి కూడా నాగబాబు అడుగుపెట్టి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. JanaSena Partyలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోగా.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆర్పీ కూడా ప్రస్తుతం నటనకు కాస్త గ్యాప్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+