అల్లు అర్జున్ భార్యకు దిమ్మతిరిగే షాకిచ్చిన మెగా ఫ్యామిలీ
మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికగా మెగా, అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్నారు అల్లు ఫ్యాన్స్. తారస్థాయిలో వీరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్పేహారెడ్డి పుట్టిన రోజు వేడుక జరిగింది. సెప్టెంబర్ 29న స్పేహారెడ్డి బర్త్ డే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా ఆమెకు విషెష్ చెప్పలేదు. పైగా స్పేహారెడ్డి ఇచ్చిన పార్టీలో సైతం మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎవరూ కూడా కనిపించలేదు. ఈ ఘటనతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్టు మరోసారి స్పష్టం అయింది.












Click it and Unblock the Notifications