రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'కు కౌంటరిచ్చిన బాలకృష్ణ
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా,జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ఫీవర్ మొదలైంది.
సినిమా విడుదలకు మరో పది రోజుల సమయం ఉన్నప్పటికీ , మెగా అభిమానులు ఇప్పటి నుంచే రచ్చ మొదలుపెట్టారు.విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. 256 అడుగుల భారీ కటౌట్‌ను విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు మెగా అభిమానులు. అయితే దీనికి నందమూరి అభిమానులు గట్టిగానే కౌంటరిస్తున్నారు.1986లోనే బాలకృష్ణ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశామని నందమూరి అభిమానులు గుర్తు చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు చిత్రం విడుదల సమయంలో 108 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికి వస్తే మూడు రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించారు.శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన భారతీయుడు 2 డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో ఉంది.
కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫెయిల్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications