ఏపీ, తెలంగాణలో 'పుష్ప2' ఎలా ఆడుతుందో చూస్తాం?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప2. ఈ సినిమాపై తెలుగులోకన్నా హిందీలో అంచనాలు అధికంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన వ్యాపారం కూడా భారీగా జరిగింది. పుష్ప2 కోసం బన్నీ అత్యధిక పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఒక్క ప్రత్యేక గీతం తీస్తే షూటింగ్ అయిపోతుంది. హీరోయిన్ కోసం దర్శకుడు సుకుమార్ వెదుకుతున్నారు. శ్రద్ధాకపూర్ అని వార్తలు వస్తున్నాయికానీ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.
ఎన్నికల సమయంలో తీవ్రస్థాయికి చేరిన విభేదాలు
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆడుతుందో చూస్తామని మెగా అభిమానులు సవాల్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇస్తారనుకుంటే అల్లు అర్జున్ తూచ్ అనిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జరిగిన సంఘటనలు అప్పటికే ఉన్న విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. సినిమాకు భారీగా కలెక్షన్లు రావాలంటే టికెట్ ధరలు పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటుంది. మెగా కుటుంబంతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్ల పెంపునకు అనుమతులు వస్తాయా? రావా? అనే ఉత్కంఠ నెలకొంది.

టికెట్ ధరల పెంపునకు పవన్ కల్యాణ్ కావాలా?
అయితే పవన్ కల్యాణ్ వివాదాలు ఎందుకనుకుంటే టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అన్న వ్యక్తికి ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవసరమయ్యాడా? అని పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడానికి మెగా అభిమానులంతా రంగం సిద్ధం చేసుకొని ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం బన్నీ దగ్గర అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ఒక టీం ఉన్న సంగతి తెలిసిందే. ఆ టీంకు ధీటుగా విడుదలైన మొదటిరోజు మొదటి ఆటనుంచే నెగెటివ్ ప్రచారానికి మెగా అభిమానులు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రితో సన్నిహిత సంబంధాలుండటంతో అతనిద్వారా టికెట్ ధరల పెంపునకు ప్రయత్నిస్తున్నారు. సినిమావారితో విభేదాలెందుకులే అని ప్రభుత్వం అనుకుంటే అనుమతి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎలా ఆడుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మరి వారు ఏవిధంగా సినిమాను ఆడకుండా, ఫ్లాప్ అయ్యేలా ఎలా చేస్తారో చూద్దాం. సినిమా బాగుంటే ఎవరు చెప్పినా, చెప్పకపోయినా కచ్చితంగా ఆడుతుంది.












Click it and Unblock the Notifications