మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రమాదం.. "పెద్ది" షూటింగ్ బ్రేక్ !!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న చిత్రం 'పెద్ది'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు (Ram Charan) గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు కంటి దగ్గర దెబ్బ తగిలి గాయమైందని.. దాంతో వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అంతా చరణ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా స్పెషల్ సాంగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు భామలు ఉంటారు. కానీ ఈ మూవీలో పాటలో ఒకరు, ఇద్దరు కాకుండా.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లను పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. డాన్స్ విషయంలో రెచ్చిపోయే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని భావిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ స్పెషల్ పాటలో మెరవనున్నట్లు సమాచారం.
కాగా ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర యాసలో ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. అంతే కాకుండా మరి ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. బుచ్చిబాబు తన మొదటి చిత్రం ఉప్పెనలో ఎవరూ ఊహించని ట్విస్ట్ పెట్టి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ విషయంలో కూడా మూవీ చివర్లో పిచ్చెక్కించే ట్విస్ట్ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications