రాజమౌళికన్నా ధీటుగా... ఆ దర్శకుడితో రామ్ చరణ్ 17వ సినిమా
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తర్వాత తన 16వ చిత్రంగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. దీనికి పెద్ది అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ఎప్పుడోనే విడుదలు కావాల్సి ఉన్నప్పటికీ దర్శకుడు శంకర్ భారతీయుడు చిత్రం షూటింగ్ లో ఉండటంతో అదికాస్తా ఆలస్యమైంది. ఈ రెండు చిత్రాలకన్నా ధీటుగా రామ్ చరణ్ తన 17వ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి, శంకర్ సినిమాలకన్నా ధీటుగా దీన్ని తీర్చిదిద్దాలనే తపనతో ఉన్న దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 17వ సినిమా చేయబోతున్నాడనే వార్త వైరలవుతోంది. గతంలోనే సుకుమార్ తో రంగస్థలం చేసి బంపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పుష్ప2 చిత్రం చేస్తున్నాడు. ఇది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. దీనితర్వాత ఆరునెలల సమయం తీసుకొని రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించడానికి సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ సినిమా ఉండబోతోందని, దీన్ని కూడా రెండు భాగాలుగా తీర్చిదిద్దనున్నారని సమాచారం.

రంగస్థలం, పుష్ప చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే దీన్ని కూడా నిర్మించనున్నారు. సినిమా సినిమాకు తన దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ వస్తోన్న సుకుమార్ ఈ చిత్రాన్ని ఎలా తీస్తారా? ఎటువంటి కథను ఎంచుకుంటారా? అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. హీరోను సహజంగా చూపించడానికి ఇష్టపడే సుకుమార్ రామ్ చరణ్ ను ఎలా చూపించబోతున్నాడో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత చెర్రీ శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో అభిమానులు పూర్తిగా నిరాశ పడుతున్నారు.












Click it and Unblock the Notifications