భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16 చిత్రం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత గ్లోబల్ స్టార్ పేరుతో దూసుకుపోతున్నారు. ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను అందుకున్నారు.
ప్రచార చిత్రాలు, వాణిజ్య ప్రకటనల్లో కూడా పాల్గొంటున్న చెర్రీ ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునేవారు. తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాకు రూ.95 నుంచి రూ.100 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఈ రెమ్యునరేషన్ కు అదనంగా మరో 30 శాతాన్ని జోడించి తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు పెద్ది అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రాజమౌళి సినిమాలో నటిస్తే పారితోషికం భారీగా రావడంతోపాటు జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అవార్డులు కూడా కొల్లగొట్టొచ్చు. అయితే రాజమౌళి రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇది మూడు సంవత్సరాల సమయం తీసుకున్నా తర్వాత ఎవరితో చేస్తారనేది ఇప్పుడే తెలియదు. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేయబోతున్న సినిమా నేపథ్యం బయటకు రానప్పటికీ ఇప్పటివరకు ఎవరూ చూడని, టచ్ చేయని సరికొత్త కథాంశంతో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను పుష్ప2 పూర్తికాగానే సుకుమార్ మొదలుపెట్టనున్నారు. ఈలోగా ఈ రెండు సినిమాలు చెర్రీ పూర్తిచేసుకుంటాడు.












Click it and Unblock the Notifications